బీర్కూరు మండలంలోనీ గై పీర్ల వాగు పొంగిపోర్లడం వల్ల మహారాష్ట్ర వెళ్లే రహదారి మూసి వేయడం జరిగింది.పక్కనే ఉన్న జమీందారు వాగు పొంగి పోరలడంతో సుమారు 700 ఎకరాల వరి పంట నీట మునిగింది.జమీందారు వాగు పూడిక తీయకపోవడం వల్ల వరి పంట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది ప్రతీ సారి వర్షాకాలంలో జరుగుతుందని అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఎవరు పాటించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వరి పంట పూర్తిగా దెబ్బ తింటుందని పనికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా జందారు వాగు కాల్వ మరమ్మతులు చేసి పూడిక తీయాలని కోరుతున్నారు.