పులివెందుల నియోజకవర్గానికి చెందిన విద్యార్థి నంద్యాల ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. హాస్టల్ గదిలో అనుమానస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం తెలిసింది. మృతిచెందిన భాను ప్రకాష్ బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. భాను ప్రకాష్ స్వస్థలం కడప జిల్లా లింగాల మండలంలోని తాతిరెడ్డి పల్లెకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుతో విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.