ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ అటవీ శాఖ కార్యాలయం నందు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చం ఉంచి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి దురదృష్టవశాత్తు మరణించిన అటవీ అమరవీరులకు ఘన నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అమరవీరుల సేవలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిబ్బంది ఎదుర్కొనే సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని తెలిపారు.