కలికిరి మండలం కలికిరి పట్టణంలోని మహాత్మ జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో డి. ఎమ్. హెచ్. ఓ ఆదేశాల మేరకు విద్యార్థినులకు మిషన్ శక్తి సంకల్ప కార్యక్రమం లో బాగంగా మేడికుర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ కావ్య గంధ మరియు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫి భేటీ బచావో,భేటీ పడావో కార్యక్రమం పై గురువారం అవగాహన కల్పించారు. గర్భస్త పిండ లింగ నిర్ధారణ చట్టం 1994(పి. సి. పి. ఎన్. డి టి ) యాక్ట్ అమలులోకి వచ్చిందన్నారు. దీని ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అని తెలుసు కోవడం చట్ట రీత్య నేరం అని ఈ చట్టాన్ని ఉల్లంగించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు