వినుకొండలో వినాయక చవితి ఉత్సవాలు సోమవారం ఘనంగా జరుగుతున్నాయి. బంగారుపు కోట సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలోని నోట్లను ఒక యువకుడు దొంగిలిస్తుండగా భక్తులు గమనించి పట్టుకున్నారు. అనంతరం యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఈ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.