శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కదిరి పట్టణంలో పలు చోట్ల భారీగా ఎత్తు ఉన్న గణనాధులను కొలువు తీర్చారు. ఈ సందర్భంగా వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి అలంకరించి పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వినాయక మండపాల వద్ద స్వామివారిని దర్శించుకుని పూజలో నిర్వహించారు.