కోడుమూరు నియోజకవర్గంలోని పడిదెంపాడు గ్రామానికి చెందిన సువేదమ్మ అనారోగ్యంతో మృతి చెందినట్లు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుని మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం అందించారు.