ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోక పల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీలను పలు రకాల పనులను పరిశీలించినట్లు డిఆర్పి తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మరియు అటవీశాఖ సంబంధించిన పనులను సైతం పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం గ్రామాలలో ఉపాధి హామీ పనులను ఎక్కువ మందికి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు డిఆర్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంచాయతీ కార్యదర్శి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.