ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గురిజేపల్లి లో శనివారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ పాటకు డాన్స్ చేస్తూ రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.