ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తూ జడ్చర్ల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ రాజయ్య ఆధ్వర్యంలోని నేతాజీ చౌక్, ఫ్లైఓవర్, గాంధీచౌక్ తదితర కూడళ్లలో సెల్ఫీ స్టిక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు మన హక్కు అనే భావనతో ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలు తమ ఓటు వినియోగంపై మరింత ఆసక్తి చూపేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ రాజయ్య తెలిపారు.