ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన గ్రామోత్సవ క్రీడా పోటీలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అధికారి ఖాసీం భేగ్, పట్టణ సీఐ రమేశ్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.