కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న చంద్ర భవన్ క్యాంటీన్ స్లాబ్ పెచ్చులు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు వూడి క్రింద పడ్డాయి. అదృష్టవసత్తు క్యాంటీన్లో కస్టమర్లు ఎవరు లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. అందులో పనిచేసి వర్కర్లు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు.ఆర్టీసీ బస్టాండ్ పైన నీరు నిల్వ ఉండడం వల్లనే గత కొన్ని సంవత్సరాలుగా స్లాబ్ పై భాగo తడిసి తడిసి శిథిలావస్థకు చేరుకుంది.గతంలో కూడా బస్టాండ్ స్లాబ్ పెచ్చులు వూడి పడినట్లు స్థానికులు చెబుతున్నారు.అధికారులు స్పందించి నూతన బస్టాండ్ బిల్డింగ్ కట్టాలని కోరుతున్నారు.