కోడుమూరు పట్టణంలో ప్రధాన రహదారిపై గుంతలు పూడ్చాలని సోమవారం సీపీఐ నాయకులు స్థానిక వై సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజు, శేషు కుమార్ మాట్లాడుతూ కర్నూలు_ బళ్లారి రహదారిపై పలుచోట్ల గుంతలు ఏర్పడ్డాయని, అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వాహనదారులు గుంతలను తప్పించుకోబోయి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అనంతరం ఆర్ అండ్ బి కార్యాలయంలో వినతి పత్రం అందించడానికి వెళ్లగా అధికారులు లేకపోవడంతో ఖాళీ కుర్చీకి అతికించారు.