కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో అప్పుల బాధతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో శ్రీనివాసులు అనే రైతు టమోటా తోటలో పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అది గమనించిన కుటుంబ సభ్యులు గుత్తి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగంలో మృతి చెందాడని డాక్టర్ కిషోర్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.