గద్వాల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజావాణికి 46 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.