నగర పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గళ్ళ మాధవి ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలించారు. తన కార్యాలయంలో ప్రజలు తెలిపిన సమస్యలను కేవలం విని ఆగిపోకుండా, వాటి పరిష్కారం కోసం స్వయంగా ద్విచక్రవాహనం నడుపుకుంటూ పలు డివిజన్లలో పర్యటించారు. ముఖ్యంగా 28వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎట్టి పరిస్థితుల్లోనూ నాసిరకం పనులు అనుమతించబోమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతతో కూడిన మురుగు కాల్వలు, రహదారులు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.