స్టాక్ ఉన్నా సాకులు చెప్పి సంబంధిత డీలర్లు ఎరువులు ఇవ్వడం లేదంటూ సంతబొమ్మాళి మండలం నౌపడలో రైతులు బుధవారం షాపుల ముందు ధర్నా నిర్వహించారు. ఎరువులు స్టాక్ ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు కు అమ్మేందుకు ఉంచి, తమకు లేవు అని చెప్తున్నారని వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయమంత్రి పదేపదే కృత్రిమ కొరత ఉండకూడదని వార్నింగ్ ఇస్తున్నప్పటికీ వ్యాపారులు అదే పని చేస్తున్నారని రైతులు ఆరోపించారు.