బెజ్జూరు మండలంలోని పాపన్నపేట గ్రామ శివారులోని పంటలకు చీరలే రక్షణ కవచం అయ్యాయి. అటవీ సమీప చేనులో సాగు చేసిన పత్తిని వన్యప్రాణులు, పశువుల నుండి రక్షించుకునేందుకు అన్నదాతలు చీరలను వాడుతున్నారు. పంటల చుట్టూ చీరలను కట్టడం వల్ల జంతువులు భయపడే అవకాశం ఉంటుందని రైతులు తెలియజేశారు. రంగురంగుల పాత చీరలను సేకరించి పత్తి చేను చుట్టూ కంచెలుగా ఏర్పాటు చేశామని రైతులు తెలిపారు,