ఉప్పల్ బస్ స్టాప్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్లే రహదారిలో గణపతి ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. దీంతో కాస్త వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అనేక రోడ్లు క్లోజ్ చేసి ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. వీలైనంతవరకు వాహనదారులు ఉప్పల్ డిపో నుంచి బోడుప్పల్ మీదుగా చిలుక నగర్, నాచారం, మల్లాపూర్ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు.