లేడీ డాన్ గా ఉన్న అరుణకు నెల్లూరు జిల్లాలోని పాత నేరస్తులు రౌడీ శీటర్లకు మధ్య ఉన్న సంబంధాలను నెల్లూరు జిల్లా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వేదయపాలెం, కోవూరు ప్రాంతాలలో ఉన్న పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు, అరుణకు మధ్య ఉన్న సంబంధాలతో పాటు వారు చేసిన సెటిల్మెంట్లు దందాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అరుణపై కేసు పెట్టేందుకు విజయవాడ నుంచి ఓ బాధితుడు కోవూరు పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు పోలీసు వర్గాలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తెలిపాయి.