కర్నూలు నగరంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లలో అవసరమైన మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణ ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 9 మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పైకప్పులపై వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య తనిఖీదారులకు సూచించారు. అలాగే హ