గుంటూరుకు చెందిన సయ్యద్, సాంబశివరావులు కౌన్సిలింగ్ కెరీర్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని నెల్లూరుకు చెందిన ఏడుగురు నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద 36 లక్షల దాకా నగదు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారని వాపోయారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.