సింగిల్ నెంబర్ ఆటాడుతున్న వ్యక్తులను వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలను మీడియా సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. చిత్రాలయ సెంటర్ వద్ద షేక్ మస్తాన్ వలీ, పరిమి వెంకటేశ్వర్లను ఏంజెల్ టాకీస్ వద్ద గుడిపాటి వెంకటేశ్వరరావు, షేక్ నన్ను బాజీని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుండి మొత్తం రూ. 50 వేలు స్వాధీనం చేసుకున్నారు