అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో తుమ్మల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదెమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని అమరాపురం మండలం తుమ్మల గ్రామంలో ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.