కరీంనగర్ డైరీతో రైతులకు అండ: ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సోమవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కరీంనగర్ డైరీ పాలకేంద్ర విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ డైరీ పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, పాల పరిశ్రమలో రాణిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తి ద్వారా రైతులు ఆదాయ వనరులు సృష్టించుకుని ఆర్థికంగా ఎదగడానికి సంస్థ సహకారం అందిస్తుందని, దీని ద్వారా లక్ష కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక వనరులు సృష్టించుకోవాలని స