రాయదుర్గం పట్టణ శివారులోని బిటిపి లేఔట్ వద్ద గుమ్మగట్ట రోడ్డులో ద్విచక్ర వాహనం డీకొన్న ఘటనలో ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పులకుంట గ్రామానికి చెందిన మంజునాథ కుటుంబం పట్టణంలోని జగనన్న లేఔట్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మద్యాహ్నం మంజునాథ కుమారుడు 8 ఏళ్ల అంజి రోడ్డు పక్కన ఆడుకుంటుండగా రాయదుర్గం వైపు నుంచి వీరాపురం వైపు వెళ్తున్న బైక్ ఆ బాలున్ని డీనడంతో కాలు చేతికి తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.