సిజి ప్రాజెక్టు నందు తమకు జరుగుతున్న అన్యాయంపై అధికారులు న్యాయం చేయకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద వలలతో ఉరి వేసుకుంటామని సి జి ప్రాజెక్టు మత్సకార సహకార సంఘం సభ్యుడు రమణ నాయక్ పేర్కొన్నారు. తనకల్లు మండలంలోని ఎంసీ తాండాకు చెందిన రమణ నాయక్ తో పాటు పలువురు మత్సకార సహకార సంఘం సభ్యులు సోమవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ గోడును విన్నవించుకున్నారు. సిజి ప్రాజెక్టు కు సంబంధించిన మత్సకార సహకార సంఘం నందు తాము సభ్యులుగా ఉన్నప్పటికీ తమకు తెలియకుండా అధికారులు టన్నుల కొద్ది చేపలను పట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిపారు