పెద్దాపురం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని శనివారం గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన కొమ్మురు గంగాధర్ అడ్డగించాడు. తమ భూ సమస్యను పరిష్కరించాలని ఆయన సీఎంను కోరారు. వెంటనే స్పందించిన చంద్రబాబు కాన్వాయ్ను ఆపి, గంగాధర్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యపై కలెక్టర్తో మాట్లాడి పరిష్కరిస్తామని సీఎం రైతుకు హామీ ఇచ్చారు.