దేశవ్యాప్తంగా పెరుగుతున్న మతతత్వ భావనలు మూఢత్వాలు శాస్త్రీయ విద్య ద్వారానే తొలగుతాయని జన విజ్ఞాన్ వేదిక సీనియర్ నాయకులు కొత్తకోట అప్పారావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు నిర్వహించారు.శాస్త్రీయ విద్యా విధానం అమలు చేసేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరిదన్నారు.