తాడిపత్రి పట్టణంలో మాజీ మంత్రి సుబ్బరాయుడు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాజీ మంత్రి సుబ్బరాయుడు కూతురు అమృతవల్లితో కలిసి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి నివాళులర్పించారు. పట్టణంలోని ఎల్లనూరు రోడ్ లో ఉన్న మాజీమంత్రి సుబ్బరాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.