దేశానికి అన్నం పెట్టే రైతును అడుక్కునే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ ధ్వజమెత్తారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతులు యూరియా కోసం ఇటుకలు, చెప్పులు క్యూలో పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.