కోడుమూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. చిన్నగా మొదలైన వర్షం క్రమేణా పుంజుకొని భారీగా కురిసింది. పొలాల్లో పనులు చేసే కూలీలు పనులను ఆపివేసి ఇళ్లకు పరుగులు తీశారు. సుమారు గంటపాటు వర్షం పడడంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. వీధులు జలమయమయ్యాయి. మండలంలో గురువారం కూడా భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.