పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్వయంగా మురుగు కాలువలో పూడిక తీసి పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ర్యాలీ నిర్వహించారు.