కర్నూలులో ఘనంగా నివాళులుకర్నూలు సిటీ సంకల్‌బాగ్‌లోని మదర్ తెరిసా విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ అధ్యక్షులు జీలాని భాష, కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టియుసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎం ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...“మదర్ తెరిసా గారు పేదల, అనాధల, అనారోగ్యంతో బాధపడే వారి సేవ కోసం జీవితాన్ని అంకితం చేశారు