Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 29, 2025
డుంబ్రిగుడా మండలం జైపూర్ జంక్షన్ వద్ద పోలీసుల వాహనాలు తనిఖీల్లో ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డుంబ్రిగుడా ఎస్ ఐ పాపినాయుడు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి రవాణాపై వచ్చిన కచ్చితమైన సమాచారం ఆదారంగా మండలంలోని జైపూర్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ప్యాకింగ్ చేసిన నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని , ద్విచక్రవాహనాలపై ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు.