వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ రైతుల ధర్నా చేపట్టారు. మంగళవారం పరిగి మండలం రంగంపల్లి గేటు సమీపంలో బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టిన రైతులు 24 గంటల కరెంట్ కావాలంటూ నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఒంటిగంటకు విద్యుత్ సరఫరా చేస్తే పొలాలకు ఎలా నీరు సరఫరా చేయాలంటూ,వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతుల అన్నారు. రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులురైతులను సముదాయించి హైవే పై ధర్నా విరమింపజేసి ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు.