నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని తొలమడుగు గ్రామానికి చెందిన చలమయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మోటర్ పేలడంతో ఒక్కసారిగా తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతనికి అత్యవసర వైద్య విభాగం అవసరమని సూచించారు. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.