ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పరిశీలించారు. ఇటీవల పాఠశాల మరమ్మతుల నేపథ్యంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించి అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని అలానే రాష్ట్రంలో ప్రతి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.