రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్ వాసునూరు చంద్రశేఖర్ అభినందన సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్ర జంగమ కార్పొరేషన్ చైర్మన్ గా కలికిరి మండలం కోటాల గ్రామానికి చెందిన టిడిపి రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షులు గా పనిచేస్తున్న వాసునూరి చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనల మేరకు టీడీపీ ప్రభుత్వం నియమించగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆదివారం జంగమ కులస్తులంతా వాసునూరి చంద్రశేఖర్ కు అభినందన సభను కలికిరి క్రాస్ రోడ్ లోని హేమాచారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు