కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం లోని మైలవరం రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.500 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.609 టిఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు జల వనరుల శాఖ అధికారులు శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. మైలవరం జలాశయం లోనికి కొండాపురం మండలం లోని గండికోట జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. మైలవరం జలాశయం నుండి ఉత్తర కాలువకు 80క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 140 క్యూసెక్కులు, పెన్నా నదికి 9857 క్యూసెక్కులు, ఆర్టిపిపికి 36 క్యూసెక్కులు, డ్రింకింగ్ మరియు బొమ్మేపల్లె ఎల్ఐ స్కీం 28 క్యూసెక్యులు నీటి విడుదల కొనసాగుతుందన్నారు.