ఉర్స్ ఉత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి హజరత్ సయ్యద్ అబ్దుల్లా షాహ బాబా ఉర్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సందేలు ఉత్సవం నిర్వహిచారు.ఈ సందర్భంగా పట్టణంలోని హబీబ్ హుస్సేన్ నివాసం నుండి గ్రంథ లేపనాన్ని డప్పు చప్పుళ్ళు తో అల్లా కీర్తనలతో దర్గా వద్దకు ముస్లింలు ర్యాలీగా చేరుకున్నారు.దర్గా వద్ద ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అల్లాహ్ ను స్మరించుకుంటూ సమాధులను దర్శించుకున్నారు