రుద్రూర్ మండల కేంద్రంలో పొలాల అమావాస్యను రైతులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి రైతులు ఎడ్లను శుభ్రంగా చేసి వాటికి రంగులు అద్ది దుస్తులు తొడిగి పూజలు నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు గ్రామంలో ఉన్న ఎడ్లను ఆంజనేయుని గుడి చుట్టూ తిప్పి పూజలు నిర్వహించారు. అనంతరం వాటికి హారతులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు.