గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో చట్ట అమలుపై సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ, స్కాన్ సెంటర్లు లేదా డయాగ్నాస్టిక్ కేంద్రాలు లింగ నిర్ధారణ చేసినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఆసుపత్రిలో చట్టంపై అవగాహన కోసం ఫ్లెక్సీ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, కొత్త కేంద్రాలు జిల్లా కమిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి 5 సంవత్సరాలకు రీన్యువల్ ముందస్తుగా చేయాలని సూచించారు.