ప్రతి వార్డ్ ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలపై పూర్తి అవగాహనతో ఉండాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు శుక్రవారం తాండూర్ మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా అధికారులతో ముఖాముఖి మాట్లాడుతూ వార్డుల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు