Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు చెరువులో JCBలు పెట్టి మట్టి తరలించే ప్రయత్నం జరుగుతున్న విషయం ఫిర్యాదు చేసేందుకు ఇరిగేషన్ కార్యాలయానికి వెళితే ఎవరు అందుబాటులో లేరని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం ఇరిగేషన్ EEకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయన్నారు. మంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉండడం బాధాకరమని ఆయన వాపోయారు.