కళ్యాణదుర్గం లోని కన్నెపల్లి రోడ్డులో హిందూ స్మశాన వాటిక సమీపంలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి పై విచారణ చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం మృతదేహాన్ని పడేశారు. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందించి విచారణ చేపట్టాలని మంగళవారం ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టడానికి సిద్ధమయ్యారు. సాయంత్రం పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేయనున్నట్లు హిందూ స్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారు.