కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 130 తీసుకురావడం ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే అని మాజీమంత్రి చింతా మోహన్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరాన్ కంటే రష్యా 70% శాతం తక్కువకు చమరును సరఫరా చేస్తుందని, తక్కువ ధరకు వస్తున్న చమరును కేంద్ర ప్రభుత్వం ఎవరికి దోచిపెడుతుందని ప్రశ్నించారు. బ్యాంకులు రైతులకు కేవలం 5% శాతం మాత్రమే రుణాలు ఇస్తున్నాయని, పెద్దవారికి 95% శాతం రుణాలు ఇస్తున్నాయని వ్యాఖ్యానించారు. నేడు రాష్ట్రంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర లేదని అన్నారు. అమరావతి దేవతల రాజధాని కాదని, నీళ్ల రాజధాని అని ఆయన విమర్శించారు