Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
కలిగిరి మండలం,తూర్పుగుడ్లదొనలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి జరిగింది. కొత్తపల్లి డెల్టా కాలువలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా దేవరపల్లి దయాకర్ రెడ్డి అనే వ్యక్తి కాలువలో పడిపోయాడు. వెంటనే అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు