ఆనందపురం మండలం మిందివానిపాలెం హైవేలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుపోషకులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ప్రభుత్వం నుంచి తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని, ట్రాఫిక్ క్లియర్ చేశారు.