నిషేధిత గంజాయి అమ్మిన, కొన్నినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు ఈస్ట్ డిఎస్పి అజీజ్ హెచ్చరించారు. ఆదివారం మధ్యాహ్నం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు డ్రగ్స్ సరఫరా చేసి అరెస్ట్ అయినా నిందితులకు అదేవిధంగా గతంలో గంజాయి సేవిస్తూ అరెస్టు కాబడిన నిందితులకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి అజీజ్ మాట్లాడుతూ గంజాయి అమ్మడం లేదా కొనడం నిషేధం అని, ఎవరైనా ఈ నిబంధనలను ఉలఘించన ఎడల చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సీఐ వీరయ్య, సిబ్బంది పాల్గొన్నారు.